సామెతలు 11:1
చుట్టుపక్కల సందర్భంతో వచనం 1 చూపబడుతోంది.
1
మోసపు త్రాసులను యెహోవా అసహ్యించుకుంటారు, న్యాయమైన తూకం అంటే ఆయనకు ఇష్టము.
2
గర్వము వెంబడి అవమానం వస్తుంది, కాని వినయం వెంట జ్ఞానం వస్తుంది.
3
యథార్థవంతుల యథార్థత వారిని నడిపిస్తుంది, కానీ నమ్మకద్రోహులు వారి వంచనతో నాశనమవుతారు.
4
ఉగ్రత దినాన సంపద విలువలేనిది, అయితే నీతి చావు నుండి విడిపిస్తుంది.