Skip to content
సంఖ్యాకాండము 7:3-9

సంఖ్యాకాండము 7:3-9

3
వారు యెహోవా ఎదుటకు ప్రతి నాయకుడి నుండి ఒక ఎద్దు, ప్రతి ఇద్దరి నుండి ఒక బండి చొప్పున ఆరు పైకప్పు ఉన్న బండ్లు, పన్నెండు ఎద్దులను తమ బహుమతులుగా తెచ్చారు. వీటిని వారు సమావేశం గుడారం ముందు సమర్పించారు.
4
యెహోవా మోషేతో,
5
“సమావేశ గుడారం సేవలో వాడబడేలా వారి నుండి వీటిని స్వీకరించు. ప్రతీ వ్యక్తి యొక్క పనికి అవసరం ఉన్న ప్రకారం, వాటిని లేవీయులకు ఇవ్వు.”
6
కాబట్టి మోషే ఆ బండ్లను, ఎద్దులను తీసుకుని లేవీయులకు ఇచ్చాడు.
7
అతడు రెండు బండ్లు, నాలుగు ఎద్దులను గెర్షోనీయులకు, వారి పనికి అవసరం ఉన్న ప్రకారం ఇచ్చాడు,
8
అలాగే నాలుగు బండ్లు, ఎనిమిది ఎద్దులను మెరారీయులకు ఇచ్చాడు. వారందరు యాజకుడైన అహరోను కుమారుడు ఈతామారు పర్యవేక్షణలో ఉన్నారు.
9
కానీ మోషే కహాతీయులకు ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే వారు వారి బాధ్యత ప్రకారం, పరిశుద్ధ వస్తువులను వారి భుజాలపై మోసేవారు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 75 chars

Options