సంఖ్యాకాండము 2:10-16
10
దక్షిణం వైపు: రూబేను గోత్రం వారు వారి జెండా క్రింద ఉండాలి. షెదేయూరు కుమారుడైన ఎలీసూరు రూబేను ప్రజల నాయకుడు.
11
అతని దళంలో ఉన్నవారు 46,500.
12
వారి ప్రక్కన షిమ్యోను గోత్రం వారు దిగాలి. సూరీషద్దాయి కుమారుడైన షెలుమీయేలు షిమ్యోను ప్రజల నాయకుడు.
13
అతని దళంలో ఉన్నవారు 59,300.
14
వారి ప్రక్కన గాదు గోత్రం వారు దిగాలి. రగూయేలు కుమారుడైన ఎలీయాసాపు గాదు ప్రజల నాయకుడు.
15
అతని దళంలో ఉన్నవారు 45,650.
16
రూబేను శిబిరానికి వారి వారి దళాల ప్రకారం కేటాయించబడిన వారందరు, 1,51,450. వీళ్ళు రెండవ గుంపుగా వెళ్తారు.
Settings