నెహెమ్యా 10:30
చుట్టుపక్కల సందర్భంతో వచనం 30 చూపబడుతోంది.
27
మల్లూకు, హారీము, బయనా.
28
మిగిలిన ప్రజలు అనగా, యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, సంగీతకారులు, ఆలయ సేవకులు దేవుని ధర్మశాస్త్రం బట్టి తమను ఆ దేశ ప్రజల నుండి వేరు చేసుకున్న వారందరు గ్రహించగలిగిన తమ భార్యలు కుమారులు కుమార్తెలతో పాటు,
29
తమ బంధువులైన అధిపతులతో కలిసివచ్చి దేవుని సేవకుడైన మోషే ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తామని, మా ప్రభువైన యెహోవా ఆజ్ఞలకు నిబంధనలకు శాసనాలకు లోబడతామని శపథం చేసి ప్రమాణం చేశారు.
30
“పొరుగు దేశ ప్రజలతో మా కుమార్తెలకు పెళ్ళి చేయము, వారి కుమార్తెలతో మా కుమారులకు పెళ్ళి చేయము.
31
“పొరుగు దేశ ప్రజలు విశ్రాంతి దినాన వారి వస్తువులు గాని ధాన్యం గాని అమ్మడానికి తెస్తే విశ్రాంతి దినాన కాని పరిశుద్ధ దినాన గాని మేము వాటిని కొనము. ప్రతి ఏడవ సంవత్సరం భూమిని దున్నకుండా వదిలివేస్తాము, అన్ని అప్పులు రద్దు చేస్తాము.
32
“మన దేవుని ఆలయ సేవ కోసం ప్రతి సంవత్సరం ఒక షెకెలు వెండిలో మూడవ వంతు ఇస్తామని నిబంధన చేసుకున్నాము.
33
ఈ డబ్బును బల్ల మీద పెట్టే రొట్టెలకు; నిత్యం అర్పించే ధాన్యార్పణలకు దహనబలులకు; విశ్రాంతి దినాల్లో, అమావాస్య పండుగ నియమించబడిన పండుగల్లో అర్పణలకు; పరిశుద్ధ అర్పణలకు; ఇశ్రాయేలీయులకు ప్రాయశ్చిత్తం కలగడానికి పాపపరిహార బలులకు; మన దేవుని ఆలయ పనులకు ఖర్చు చేస్తాము.
Settings