Skip to content
మీకా 4:1-3

మీకా 4:1-3

1
చివరి రోజుల్లో యెహోవా ఆలయ పర్వతం పర్వతాలన్నిటిలో ఉన్నతమైనదిగా స్థిరపరచబడుతుంది; అది కొండలకు పైగా హెచ్చింపబడుతుంది, ప్రజలు ప్రవాహంలా దాని దగ్గరకు వెళ్తారు.
2
అన్య దేశాల వారనేకులు వచ్చి ఇలా అంటారు, “రండి, మనం యెహోవా పర్వతం మీదికి, యాకోబు దేవుని ఆలయానికి వెళ్దాము. మనం ఆయన మార్గంలో నడిచేలా, ఆయన మనకు తన మార్గాల్ని బోధిస్తారు.” సీయోనులో నుండి ధర్మశాస్త్రం, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయటకు వెళ్తాయి.
3
ఆయన అనేక ప్రజలకు తీర్పు తీరుస్తారు, దూరంగా ఉన్న బలమైన దేశాల వివాదాలను పరిష్కరిస్తారు. వారు తమ ఖడ్గాలను సాగగొట్టి నాగటి నక్కులుగా, తమ ఈటెలను సాగగొట్టి మడ్డికత్తులుగా చేస్తారు. దేశం మరొక దేశం మీది ఖడ్గం తీయదు, వారు ఇకపై యుద్ధానికి శిక్షణ పొందరు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options