కంటెంట్‌కు వెళ్లండి
లేవీయకాండము 8:6-13

యాజకులకు వస్త్రధారణ చేయించి అభిషేకించుట

లేవీయకాండము 8:6-13
6
అప్పుడు మోషే, అహరోనును, అతని కుమారులను ముందుకు తెచ్చి నీటితో వారిని కడిగాడు.
7
అతడు అహరోను మీద పైవస్త్రం వేసి, నడికట్టు కట్టి, ఏఫోదు వస్త్రాన్ని, అలాగే ఏఫోదును అతనికి ధరింపజేశాడు. అతడు ఏఫోదును అల్లబడిన నడికట్టుతో అతనికి చుట్టూ కట్టాడు.
8
అతడు రొమ్ము పతకాన్ని అతనిపై ఉంచాడు, రొమ్ము పతకం లోపల ఊరీము తుమ్మీములను అమర్చాడు.
9
యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు, అతడు అహరోను తలమీద తలపాగాను పెట్టి, దానికి బంగారు పలకను అమర్చి దానికి పవిత్ర చిహ్నాన్ని తగిలించాడు.
10
తర్వాత మోషే అభిషేక తైలాన్ని తీసుకుని సమావేశ గుడారాన్ని, దానిలోని ప్రతిదాన్ని అభిషేకించి, వాటిని పవిత్రం చేశాడు.
11
అతడు బలిపీఠాన్ని, దాని పాత్రలన్నిటిని, దాని గంగాళాన్ని దాని పీటను ప్రతిష్ఠించడానికి, బలిపీఠం మీద ఏడుసార్లు కొంచెం నూనె చిలకరించి వాటిని అభిషేకించాడు.
12
అహరోనును ప్రతిష్ఠించడానికి అభిషేక తైలంలో కొంచెం అతని తలమీద పోశాడు.
13
తర్వాత యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లుగా అతడు అహరోను కుమారులను ముందుకు తీసుకువచ్చి, వారికి చొక్కాలు తొడిగించి నడికట్టు కట్టి, వారి తలల మీద టోపీలను పెట్టాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options