Skip to content
లేవీయకాండము 26:40-45

భవిష్యత్తు పునరుద్ధరణ వాగ్దానం

లేవీయకాండము 26:40-45
40
“ ‘కాని వారు తమ పాపాలను, వారి పూర్వికుల పాపాలను ఒప్పుకుని అంటే వారు నాకు చేసిన ద్రోహం, తద్వార నేను వారికి విరుద్ధంగా నడిచి, వారిని శత్రువుల దేశానికి పంపానని ఒప్పుకుని, అంటే సున్నతిలేనివారి హృదయాలు తగ్గించుకొని వారి పాపాలకు వారు మూల్యం చెల్లిస్తే,
42
నేను యాకోబుతో నా నిబంధనను, ఇస్సాకుతో నా నిబంధనను, అబ్రాహాముతో నా నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను, దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటాను.
43
భూమి వారిచే విడిచిపెట్టబడుతుంది, నిర్జనమవుతుంది, వారు లేకుండా, నిర్జన స్థితిలో ఉండగా, అది సబ్బాతు దినాలను ఆనందిస్తుంది. వారు నా చట్టాలను తిరస్కరించారు, నా శాసనాలను అసహ్యించుకున్నారు కాబట్టి వారు వారి పాపాలకు మూల్యం చెల్లిస్తారు.
44
అయినప్పటికీ, వారు తమ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు, వారితో నా నిబంధనను విచ్ఛిన్నం చేస్తూ, వారిని పూర్తిగా నాశనం చేసే విధంగా నేను వారిని తిరస్కరించను, అసహ్యించుకోను. నేను వారి దేవుడనైన యెహోవానై ఉన్నాను.
45
అయితే వారి కోసం నేను జనముల దృష్టిలో వారి దేవునిగా ఉండాలని ఈజిప్టు నుండి బయటకు తెచ్చిన వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను యెహోవాను.’ ”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options