- English
- King James KJV
- Complete Jewish CJB
- World English WEBM
- Berean Standard BSB
- American Standard ASV
- Geneva GNV
- Young's Literal YLT
- Douay-Rheims DRC
- International
- Shqip ALB
- العربية SVD
- বাংলা BN-IRV
- မြန်မာ Judson
- 简体文 CUV-S
- 繁體中文 CUV-T
- Čeština BKR
- Nederlands STVE
- Français LSG
- Deutsch SCH
- Ελληνικά Vamvas
- ગુજરાતી GU-IRV
- Hausa HCB
- עברית Hebrew
- हिन्दी HCV
- Magyar KAROLI
- Bahasa Indonesia INDO-TB
- Italiano Diodati
- 日本語 Kougo
- 한국어 Korean
- മലയാളം MAL
- मराठी MRCV
- Norsk DNB
- فارسی OPV
- Polski BG
- Português Almeida
- Română Cornilescu
- Русский Synodal
- Español RVG
- Kiswahili Neno
- Svenska SV1917
- Tagalog TAG-ADB
- தமிழ் TCV
- తెలుగు TSA
- ภาษาไทย THAI-KJV
- Українська Ohienko
- Tiếng Việt CADMAN
- Yorùbá YCB
భూమికి విశ్రాంతి సంవత్సరము
లేవీయకాండము 25:1-7
భూమికి విశ్రాంతి సంవత్సరము
1
సీనాయి పర్వతం మీద యెహోవా మోషేతో ఇలా అన్నారు,
2
“ఇశ్రాయేలీయులతో మాట్లాడి ఇలా చెప్పు: ‘నేను మీకు ఇవ్వబోయే దేశంలో మీరు ప్రవేశించినప్పుడు, స్వయాన ఆ భూమి కూడా యెహోవాకు సబ్బాతు పాటించాలి.
3
ఆరు సంవత్సరాలు పొలంలో విత్తనాలు చల్లాలి విత్తనాలు చల్లవచ్చు, ద్రాక్షతోటలు సాగుచేసుకుని వాటి ఫలాలు సమకూర్చుకోవచ్చు.
4
కానీ ఏడవ సంవత్సరం భూమికి సబ్బాతు విశ్రాంతి సంవత్సరం, అది యెహోవాకు సబ్బాతు. మీ పొలాల్లో విత్తనాలు వేయకూడదు. ద్రాక్షతోటలు సాగుచేయకూడదు.
5
దానికదిగా పెరిగే పంటను కోయవద్దు, సాగుచేయని మీ ద్రాక్షతోటల నుండి ద్రాక్షపండ్లను కోయవద్దు. భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి ఉండాలి.
6
సబ్బాతు సంవత్సరంలో భూమి దానికదిగా ఏ పంట మీకు, మీ దాసులకు, దాసీలకు, మీ మధ్య నివసించే కూలి పనివారికి, అలాగే మీ మధ్య నివసించే విదేశీయులకు ఆహారమవుతుంది,
7
అలాగే మీ పశువులకు, మీ దేశంలోని అడవి జంతువులకు ఆహారం అవుతుంది. భూమి దేన్ని ఉత్పత్తి చేసినా తినవచ్చు.
In this passage
- Who
- Where
- When
- About
See also
Where else Scripture says this.
2 దినవృత్తాంతములు 36:21
దేశం తన సబ్బాతు దినాలను ఆనందంగా గడిపింది; యిర్మీయా చెప్పిన యెహోవా వాక్కు నెరవేరేలా డెబ్బై సంవత్సరాలు పూర్తయ్యే వరకు అది పాడైన సమయమంతా విశ్రాంతి తీసుకుంది.from verse 2నిర్గమకాండము 23:10
“ఆరు సంవత్సరాలు మీరు పొలంలో విత్తనాలు విత్తి పంట కోయాలి,from verse 2లేవీయకాండము 26:34
మీరు మీ శత్రువుల దేశంలో ఉన్నప్పుడు భూమి తన సబ్బాతు సంవత్సరాలను ఆనందిస్తుంది తద్వార ఎప్పటికీ అది నిర్జనమై ఉంటుంది; అప్పుడు భూమి విశ్రాంతి తీసుకుని దాని సబ్బాతు దినాలను ఆనందిస్తుంది.from verse 2లేవీయకాండము 26:35
అన్ని సమయాల్లో అది నిర్జనమై ఉంటుంది, మీరు అందులో నివసించినప్పుడు సబ్బాతు దినాల్లో అది పొందని విశ్రాంతిని పొందుతుంది.from verse 2నిర్గమకాండము 23:11
ఏడవ సంవత్సరం ఆ భూమిని దున్నకుండా ఉపయోగించకుండా వదిలేయాలి. అప్పుడు మీ ప్రజల్లో పేదవారు దాని నుండి ఆహారం తీసుకోగా మిగిలింది అడవి జంతువులు తినవచ్చు. మీ ద్రాక్షతోటకు ఒలీవతోటకు ఇలాగే చేయాలి.from verse 4లేవీయకాండము 25:20
“మేము మా పంటలను నాటడం లేదా పండించకపోతే ఏడవ సంవత్సరంలో మేము ఏమి తింటాము?” అని మీరు అడగవచ్చు.from verse 4లేవీయకాండము 25:23
“ ‘భూమి శాశ్వతంగా అమ్మకూడదు, ఎందుకంటే భూమి నాది, మీరు నా భూమిలో విదేశీయులు, అపరిచితులుగా నివసిస్తున్నారు.from verse 4యెషయా 8:8
అవి యూదాలోకి వచ్చి పొంగిపొర్లి ప్రవహిస్తూ, గొంతు లోతు వరకు చేరుతాయి. ఇమ్మానుయేలూ, దాని చాచిన రెక్కలు నీ దేశమంతట వ్యాపిస్తాయి.”from verse 22 రాజులు 19:29
“హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు.from verse 5యెషయా 37:30
“హిజ్కియా, దానికి నీకిదే సూచన: “ఈ సంవత్సరం దాని అంతట అదే పండే పంటను మీరు తింటారు, రెండవ ఏట దాని నుండి కలిగే ధాన్యాన్ని మీరు తింటారు. అయితే మూడవ ఏట విత్తనాలు చల్లి కోత కోస్తారు, ద్రాక్షతోటలు నాటి వాటి ఫలాలు మీరు తింటారు.from verse 5నిర్గమకాండము 19:1
ఇశ్రాయేలీయులు ఈజిప్టు నుండి బయటకు వచ్చిన మూడవ నెల మొదటి రోజున వారు సీనాయి అరణ్యానికి వచ్చారు.from verse 1గలతీయులకు 4:24
ఈ విషయాలను ఉపమానరీతిగా చెప్పవచ్చు. ఈ స్త్రీలు రెండు నిబంధనలను సూచిస్తున్నారు. ఒక నిబంధన సీనాయి పర్వతం దగ్గరిది, ఇది హాగరు: బానిసలుగా ఉండడానికి పిల్లలను కంటుంది.from verse 1
Study Note
Settings