Skip to content
లేవీయకాండము 22:20-25

లేవీయకాండము 22:20-25

20
లోపం ఉన్నదానిని తీసుకురాకండి ఎందుకంటే అది మీ పక్షాన అంగీకరించబడదు.
21
ప్రత్యేక మ్రొక్కుబడి లేదా స్వేచ్ఛార్పణ కోసం ఎవరైనా పశువుల మందలో నుండి గాని లేదా గొర్రెల మందలో నుండి గాని యెహోవాకు సమాధానబలి తెస్తే, అది అంగీకరించబడేలా ఏ లోపం లేనిదై ఉండాలి.
22
యెహోవాకు గ్రుడ్డి దానిని గాని, గాయపడిన దానిని గాని లేదా అంగవైకల్యం ఉన్నదానిని గాని, చీముపట్టిన పుండ్లతో ఉన్నదానిని గాని అర్పించకూడదు. యెహోవాకు హోమబలిగా వీటిలో దేన్ని బలిపీఠం మీద ఉంచవద్దు.
23
అయితే మీరు ఒక అంగవైకల్యంతో ఉన్న ఎద్దును గాని లేదా గొర్రెలను గాని స్వేచ్ఛార్పణగా సమర్పించవచ్చు, కాని ఒక మ్రొక్కుబడి చెల్లించడానికైతే ఇది అంగీకరించబడదు.
24
వృషణాలు నలిపివేయబడిన, గాయపడిన, చీల్చివేయబడిన లేదా కత్తిరించబడిన జంతువును మీరు యెహోవాకు అర్పించకూడదు. మీరు మీ స్వదేశంలో ఇలా చేయకూడదు.
25
మీరు అలాంటి జంతువులను విదేశీయుని చేతిలో నుండి స్వీకరించి, వాటిని మీ దేవునికి ఆహారంగా అర్పించకూడదు. అవి అంగవైకల్యం, లోపాలు కలిగి ఉన్నాయి కాబట్టి మీ పక్షాన అవి అంగీకరించబడవు.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options