Skip to content
లేవీయకాండము 21:10-15

ప్రధానయాజకునికి కఠినమైన విధులు

లేవీయకాండము 21:10-15
10
“ ‘ప్రధాన యాజకునిగా ఉండడానికి తన సహోదరులలో ఎవరి తలపై అభిషేకతైలం పోయబడి, యాజక వస్త్రాలను ధరించడానికి ఎవరు నియమించబడ్డారో వారు తన జుట్టును విరబోసుకోవద్దు, బట్టలు చింపుకోకూడదు.
11
అతడు శవాల దగ్గరకి వెళ్లకూడదు. అతడు తన తండ్రి శవం వలన గాని తల్లి శవం వలన గాని తనను తాను అపవిత్రంగా చేసుకోకూడదు.
12
అతడు తన దేవుని అభిషేక తైలంతో ప్రతిష్ఠించబడ్డాడు కాబట్టి అతడు తన దేవుని పరిశుద్ధాలయాన్ని విడిచిపెట్టకూడదు, దానిని అపవిత్రం చేయకూడదు. నేను యెహోవాను.
13
“ ‘అతడు కన్యను పెళ్ళి చేసుకోవాలి.
14
విధవరాలిని గాని, భర్త విడిచిపెట్టిన దాన్ని గాని, వేశ్యను గాని పెళ్ళి చేసుకోకూడదు, తన సొంత ప్రజల్లో నుండి కన్యను అతడు పెళ్ళి చేసుకోవాలి,
15
అతడు తన ప్రజల్లో తన సంతానాన్ని అపవిత్రం చేయకూడదు. అతన్ని పరిశుద్ధపరచే యెహోవాను నేను.’ ”

బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.