కంటెంట్‌కు వెళ్లండి
లేవీయకాండము 20:27

మృతుల ఆత్మలను సంప్రదించుటకు శిక్ష

లేవీయకాండము 20:27
చుట్టుపక్కల సందర్భంతో వచనం 27 చూపబడుతోంది.
24
కానీ నేను మీతో, “మీరు వారి భూమిని స్వాధీనం చేసుకుంటారు; పాలు తేనెలు ప్రవహించే భూమిని నేను మీకు వారసత్వంగా ఇస్తాను” అని చెప్పాను. దేశాల్లో నుండి మిమ్మల్ని ప్రత్యేకపరచిన మీ దేవుడనైన యెహోవాను నేనే.
25
“ ‘అందువల్ల మీరు పవిత్రమైన జంతువులకు అపవిత్రమైన జంతువులకు, పవిత్రమైన పక్షులకు అపవిత్రమైన పక్షులకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. అపవిత్రమైనవని మీకు వేరుచేసి చెప్పిన ఏ జంతువు వలన గాని పక్షి వలన గాని నేల మీద ప్రాకే దేనివలన గాని మిమ్మల్ని మీరు అపవిత్రం చేసుకోవద్దు.
26
మీరు నాకు పరిశుద్ధులై ఉండాలి, ఎందుకంటే, నేను యెహోవాను, నేను పరిశుద్ధుడను, జనాల్లో నుండి నేను మిమ్మల్ని నా సొంతవారిగా ప్రత్యేకించుకున్నాను.
27
“ ‘మీ మధ్య స్త్రీలలో గాని పురుషులలో గాని మృతుల ఆత్మలతో మాట్లాడేవారు లేదా సోదె చెప్పేవారు వారికి మరణశిక్ష విధించాలి. వారిని రాళ్ళతో కొట్టాలి; వారి మరణానికి వారే బాధ్యులు.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options