లేవీయకాండము 20:10-16
10
“ ‘మరొకని భార్యతో అనగా తన పొరుగువాని భార్యతో వ్యభిచరించిన వారికి ఆ వ్యభిచారిణికి ఇద్దరికి మరణశిక్ష విధించాలి.
11
“ ‘తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం ఉన్నవాడు తన తండ్రిని అగౌరపరిచాడు. ఆ స్త్రీ పురుషులిద్దరినీ చంపేయాలి; వారి మరణానికి వారే బాధ్యులు.
12
“ ‘ఒకడు తన కోడలితో లైంగిక సంబంధం కలిగియుంటే, వారిద్దరినీ చంపేయాలి; వారు వక్రబుద్ధికి పాల్పడ్డారు; వారి మరణానికి వారే బాధ్యులు.
13
“ ‘ఒకడు స్త్రీతో ఉన్నట్టు మరో పురుషునితో లైంగిక సంబంధం కలిగివుంటే వారిద్దరు హేయమైనది చేశారు కాబట్టి వారికి మరణశిక్ష విధించాలి. వారి మరణానికి వారే బాధ్యులు.
14
“ ‘ఒకడు స్త్రీని, ఆమె తల్లిని కూడా పెళ్ళి చేసుకోవడం దుర్మార్గము. అతడిని వారిద్దరు అగ్నిలో కాల్చివేయాలి. అప్పుడు మీ మధ్యలో దుర్మార్గం ఉండదు.
15
“ ‘జంతువుతో లైంగిక సంబంధం పెట్టుకున్న వానికి మరణశిక్ష విధించాలి, ఆ జంతువును చంపాలి.
16
“ ‘ఒక స్త్రీ లైంగిక సంబంధం కోసం జంతువు దగ్గరకు వెళ్లితే, ఆ స్త్రీని ఆ జంతువు చంపాలి; వారి మరణానికి వారే బాధ్యులు.
Settings