లేవీయకాండము 11:14-22
14
ఎర్ర గ్రద్ద, ప్రతి రకమైన నల్ల గ్రద్ద,
15
ప్రతి రకమైన కాకి,
16
కొమ్ముల గుడ్లగూబ, జీరగపిట్ట, కోకిల, ప్రతి రకమైన డేగ,
17
పైడికంటే, చెరువు కాకి, గుడ్లగూబ,
18
హంస, గూడబాతు, నల్లబోరువ,
19
సంకు బుడ్డి కొంగ, ప్రతి రకమైన కొంగ, కూకుడు గువ్వ, గబ్బిలము.
20
“ ‘నాలుగు కాళ్లతో నడిచే ఎగిరే పురుగులన్నీ మీకు అపవిత్రమైనవిగా మీరు భావించాలి.
21
అయితే, నాలుగు కాళ్లతో నడుస్తూ నేలమీద గెంతడానికి కాళ్లకు కీళ్ళున్న ఎగిరే కీటకాలను మీరు తినవచ్చు.
22
వీటిలో నేత మిడత గాని చిన్న మిడత గాని ఆకు మిడత గాని ప్రతి రకమైన మిడతను తినవచ్చు.
Settings