Skip to content
విలాపవాక్యములు 2:1-4

విలాపవాక్యములు 2:1-4

1
ప్రభువు తన కోపంతో సీయోను కుమార్తెను మేఘంతో కప్పివేశారు! ఆయన ఇశ్రాయేలు వైభవాన్ని ఆకాశం నుండి భూమి మీదికి పడగొట్టారు; ఆయన తన కోప్పడిన దినాన తన పాదపీఠాన్ని జ్ఞాపకం చేసుకోలేదు.
2
దయ లేకుండా ప్రభువు యాకోబు నివాసాలన్నింటినీ నాశనం చేశారు. తన కోపంలో ఆయన తన కుమార్తెయైన యూదా కోటలను పడగొట్టారు. ఆయన ఆమె రాజ్యాన్ని, దాని అధిపతులను అగౌరపరచి నేలకూల్చారు.
3
ఆయన తన కోపాగ్నిలో ఇశ్రాయేలీయుల ప్రతి కొమ్మును నరికివేశారు. శత్రువు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన తన కుడిచేతిని వెనుకకు తీసుకున్నారు. ఆయన యాకోబులో మండుతున్న అగ్నిలా, దాని చుట్టూ ఉన్న సమస్తాన్ని దహించే మంటలా ఉన్నారు.
4
ఒక శత్రువులా ఆయన తన విల్లు ఎక్కుపెట్టారు; ఆయన కుడిచేయి సిద్ధంగా ఉంది. ఆయన ఒక శత్రువులా కంటికి నచ్చిన వారందరినీ చంపేశారు; ఆయన తన కోపాన్ని అగ్నిలా సీయోను కుమార్తె గుడారం మీద కుమ్మరించారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options