న్యాయాధిపతులు 3:13
చుట్టుపక్కల సందర్భంతో వచనం 13 చూపబడుతోంది.
10
యెహోవా ఆత్మ అతని మీదికి వచ్చినందుకు అతడు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉంటూ యుద్ధానికి వెళ్లాడు. యెహోవా ఒత్నీయేలు చేతికి అరాము రాజైన కూషన్-రిషాతాయిమును అప్పగించారు, అతడు అతన్ని ఓడించాడు.
11
కాబట్టి కెనజు కుమారుడైన ఒత్నీయేలు చనిపోయే వరకు నలభై సంవత్సరాలు దేశం సమాధానంతో ఉంది.
12
ఇశ్రాయేలీయులు మరలా యెహోవా కళ్ళెదుట చెడు కార్యాలు చేశారు, వారు చెడు కార్యాలు చేసినందుకు యెహోవా మోయాబు రాజైన ఎగ్లోనుకు ఇశ్రాయేలుపై బలం ఇచ్చారు.
13
అతడు అమ్మోనీయులను అమాలేకీయులను పోగుచేసుకుని ఇశ్రాయేలీయులను ఓడించి ఖర్జూర చెట్ల పట్టణాన్ని స్వాధీనపరచుకున్నాడు.
14
ఇశ్రాయేలీయులు పద్దెనిమిది సంవత్సరాలు మోయాబు రాజైన ఎగ్లోనుకు దాసులుగా ఉన్నారు.
15
మరలా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టారు, ఆయన బెన్యామీనీయుడైన గెరా కుమారుడు, ఎడమ చేతివాటం గలవాడైన ఏహూదును రక్షకునిగా వారి కోసం నియమించారు. అతన్ని ఇశ్రాయేలీయులు మోయాబు రాజైన ఎగ్లోనుకు పన్ను చెల్లించడానికి పంపారు.
16
ఏహూదు మూరెడు పొడవు ఉన్న రెండంచుల ఖడ్గాన్ని చేసికొని దానిని కుడి తొడకు కట్టుకుని తన బట్టలు క్రింద కప్పుకున్నాడు.
Settings