Skip to content
న్యాయాధిపతులు 1:1-7

యూదా మరియు షిమ్యోనులకు అప్పగించబడిన కార్యం

న్యాయాధిపతులు 1:1-7
1
యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు, “కనానీయులతో యుద్ధం చేయడానికి మాలో ఎవరు మొదట వెళ్లాలి?” అని యెహోవాను అడిగారు.
2
యెహోవా జవాబిస్తూ, “యూదా వారు వెళ్లాలి; నేను ఆ దేశాన్ని వారి చేతికి అప్పగించాను” అన్నారు.
3
యూదా గోత్రం వారు తమ తోటి ఇశ్రాయేలీయులైన షిమ్యోను గోత్రం వారితో, “మాకు కేటాయించబడిన భూభాగంలో ఉన్న కనానీయులతో యుద్ధానికి మాతో పాటు రండి. అలాగే మీతో పాటు మేము కూడా మీ భూభాగం కోసం వస్తాం” అన్నారు. కాబట్టి షిమ్యోనీయులు వారితో వెళ్లారు.
4
యూదా దాడి చేసినప్పుడు యెహోవా కనానీయులను, పెరిజ్జీయులను వారి చేతికి అప్పగించారు; వారు బెజెకు దగ్గర పదివేలమంది పురుషులను హతం చేశారు.
5
వారు బెజెకు దగ్గర రాజైనా అదోని-బెజెకును చూసి అతనితో యుద్ధం చేసి కనానీయులను, పెరిజ్జీయులను ఓడించారు.
6
అదోని-బెజెకు పారిపోయినప్పుడు వారు అతన్ని తరిమి పట్టుకుని అతని కాలు చేతుల బొటన వ్రేళ్ళను కోసివేశారు.
7
అప్పుడు రాజైన అదోని-బెజెకు, “ఇలా కాలు చేతుల బొటన వ్రేళ్ళు కోయబడిన డెబ్బైమంది రాజులు నా బల్లక్రింద పడిన ముక్కలు ఏరుకునేవారు. నేను వారికి చేసిన దానికి దేవుడు నాకు తగిన ప్రతిఫలమిచ్చారు” అని అన్నాడు. వారు అతన్ని యెరూషలేముకు తీసుకువచ్చారు, అతడక్కడ చనిపోయాడు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options