దేవుడు కనికరం చూపుట
చుట్టుపక్కల సందర్భంతో వచనం 10 చూపబడుతోంది.
7
అతడు నీనెవెలో ఈ ప్రకటన చేశాడు: “రాజు, అతని ఘనుల శాసనం ప్రకారం: “మనుష్యులు గాని జంతువులు పశువులు గొర్రెల మందలు గాని దేన్ని రుచి చూడకూడదు తినకూడదు త్రాగకూడదు.
8
మనుష్యులు పశువులు గోనెపట్ట కప్పుకోవాలి. అందరు తక్షణమే దేవున్ని వేడుకోవాలి. తమ చెడు మార్గాలను, దౌర్జన్యాన్ని మానివేయాలి.
9
దేవుని మనస్సు మార్చుకుని కనికరంతో తన తీవ్రమైన కోపాన్ని విడిచిపెట్టి మనం నశించకుండా చేస్తారేమో ఎవరికి తెలుసు?”
10
వారు చేసింది, వారు ఎలా తమ చెడుతనాన్ని విడిచిపెట్టారో దేవుడు చూసి తన మనస్సు మార్చుకొని, ఆయన వారికి మీదికి రప్పిస్తానని చెప్పిన కీడును రానివ్వలేదు.
Settings