Skip to content
యోబు 36:5-15

దేవుని శక్తి నిష్పక్షపాత న్యాయము

యోబు 36:5-15
5
“దేవుడు మహాబలవంతుడు, కాని ఎవరిని త్రోసివేయరు; ఆయన శక్తిమంతుడు, తన ఉద్దేశ్యంలో దృఢంగా ఉంటారు.
6
ఆయన దుష్టులను బ్రతకనివ్వరు కాని బాధితులకు న్యాయం చేస్తారు.
7
నీతిమంతులను ఆయన చూడకపోరు; వారిని రాజులతో పాటు సింహాసనంపై కూర్చోబెట్టి నిత్యం వారిని ఘనపరుస్తారు.
8
ప్రజలు గొలుసులతో బంధించబడి, బాధ అనే త్రాళ్లతో కట్టబడి ఉంటే,
9
వారు అహంకారంతో పాపం చేశారని ఆయన వారు చేసిన దానిని వారికి చెప్తారు.
10
దిద్దుబాటును వినేలా చేస్తారు తమ చెడుతనాన్ని గురించి పశ్చాత్తాపపడాలని వారిని ఆజ్ఞాపిస్తారు.
11
ఒకవేళ వారు లోబడి ఆయనను సేవిస్తే, వారు తమ మిగిలిన రోజులు క్షేమంగా తమ సంవత్సరాలు సంతృప్తిగా గడుపుతారు.
12
అయితే వారు వినకపోతే, వారు ఖడ్గం చేత నశిస్తారు జ్ఞానం లేకుండానే చనిపోతారు.
13
“హృదయంలో భక్తిలేనివారు కోపాన్ని ఉంచుకుంటారు; ఆయన వారిని బంధించినప్పుడు వారు సహాయం కోసం మొరపెట్టరు.
14
వారు తమ యవ్వనకాలంలో చనిపోతారు, పుణ్యక్షేత్రాల మగ వ్యభిచారుల మధ్య వారి జీవితం ముగుస్తుంది.
15
బాధపడుతున్నవారిని ఆయన వారి బాధలనుండి విడిపిస్తారు; బాధల్లో ఆయన వారితో మాట్లాడతారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options