యోబు ఉపదేశాధికారము
21
“ప్రజలు నేను చెప్పేది ఆశగా వినేవారు, నా సలహా కోసం మౌనంగా ఎదురు చూసేవారు.
22
నేను మాట్లాడిన తర్వాత, వారికిక ఏమి మాట్లాడలేదు; నా మాటలు మృదువుగా వారి చెవులకు చేరాయి.
23
వర్షం కోసం చూసినట్లు వారు నా కోసం ఎదురు చూశారు, కడవరి వర్షంలా వారు నా మాటలు త్రాగారు.
24
నేను వారిని చూసి నవ్వినప్పుడు; వారు కష్టంగా దాన్ని నమ్మారు; నా ముఖకాంతి వారికి ప్రశస్తమైనది.
25
వారికి నేనే పెద్దగా కూర్చుని వారి కోసం మార్గం ఏర్పరిచాను; సైన్యం మధ్యలో ఉండే రాజులా, దుఃఖంలో ఉన్నవారిని ఆదరించేవానిగా నేనున్నాను.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.