12
“దేవుడు ఎత్తైన ఆకాశాల్లో లేరా? పైనున్న నక్షత్రాలను చూడు అవి ఎంత ఉన్నతంగా ఉన్నాయి!
13
అయినా నీవు, ‘దేవునికేమి తెలుసు? గాఢాంధకారంలో నుండి ఆయన న్యాయం చెప్పగలడా?
14
ఆకాశమండలం పైన ఆయన తిరుగుచున్నాడు కాబట్టి మేఘాలు ఆయనను కప్పివేశాయి ఆయన చూడలేడు’ అని అంటున్నావు.