Skip to content
యిర్మీయా 23:21-32

యిర్మీయా 23:21-32

21
నేను ఈ ప్రవక్తలను పంపలేదు, అయినాసరే వారు తమ సొంత సందేశంతో పరుగెత్తుకు వచ్చారు; నేను వారితో మాట్లాడలేదు, అయినాసరే వారు ప్రవచించారు.
22
కానీ ఒకవేళ వారు నా సభలో నిలబడి ఉంటే, వారు నా ప్రజలకు నా మాటలు ప్రకటించి వారి చెడు మార్గాల నుండి వారి చెడు పనుల నుండి వారిని తప్పించి ఉండేవారు.
23
“నేను దగ్గరగా ఉంటేనే దేవుణ్ణా, దూరంగా ఉంటే నేను దేవున్ని కానా? అని యెహోవా ప్రకటిస్తున్నారు.
24
నాకు కనబడకుండ ఎవరైనా రహస్య ప్రదేశాల్లో దాచుకోగలరా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “నేను ఆకాశంలో భూమి మీద అంతటా లేనా?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
25
“నా పేరిట అబద్ధాలు చెప్పే ప్రవక్తలు చెప్పేది నేను విన్నాను. వారు, ‘నాకొక కల వచ్చింది! నాకొక కల వచ్చింది!’ అని అంటారు.
26
తమ మనస్సులోని భ్రమలను ప్రవచించే ఈ అబద్ధాల ప్రవక్తల హృదయాల్లో ఇలా ఎంతకాలం కొనసాగుతుంది?
27
తమ పూర్వికులు బయలును ఆరాధించి నా పేరును మరచిపోయినట్లే, వీరు ఒకరికొకరు చెప్పుకునే కలలు నా ప్రజలు నా పేరును మరచిపోయేలా చేస్తాయని వీరు అనుకుంటున్నారు.
28
కలలు కనే ప్రవక్తలు వారి కలలను చెప్పవచ్చు, నా సందేశాన్ని పొందుకున్న వారు ఆ సందేశాన్ని నమ్మకంగా చెప్పవచ్చు. పొట్టుకు ధాన్యంతో ఏమి సంబంధం?” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
29
“నా మాట అగ్నిలాంటిది కాదా, బండను ముక్కలు చేసే సుత్తిలాంటిది కాదా? అని యెహోవా ప్రకటిస్తున్నారు.
30
“కాబట్టి,” యెహోవా ఇలా ప్రకటిస్తున్నారు, “ఒకరి నుండి నా మాటలను దొంగిలించే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.
31
అవును” అని యెహోవా ప్రకటిస్తున్నారు, “తమ నాలుకలతో తమ స్వంత మాటలు మాట్లాడుతూ ‘యెహోవా ప్రకటిస్తున్నారు’ అనే చెప్పే ప్రవక్తలకు నేను వ్యతిరేకిని.
32
నిజానికి, తప్పుడు కలలను ప్రవచించే వారికి నేను వ్యతిరేకిని” అని యెహోవా ప్రకటిస్తున్నారు. “వారు తమ మోసపూరితమైన అబద్ధాలతో నా ప్రజలను తప్పుత్రోవ పట్టిస్తారు, నేను వారిని పంపలేదు వారిని నియమించలేదు. వారి వల్ల ఈ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు” అని యెహోవా ప్రకటిస్తున్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options