యిర్మీయా 11:8-10
8
అయితే వారు వినలేదు లేదా పట్టించుకోలేదు. బదులుగా, వారు తమ దుష్ట హృదయాల మొండితనాన్ని అనుసరించారు. కాబట్టి నేను వారికి ఆజ్ఞాపించిన నిబంధన శాపాలన్నిటిని వారిపైకి తెచ్చాను, కానీ వారు పాటించలేదు.’ ”
9
అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు: “యూదా ప్రజల్లోనూ, యెరూషలేములో నివసించేవారిలోనూ కుట్ర ఉంది.
10
నా మాటలు వినడానికి నిరాకరించిన తమ పూర్వికుల పాపాలకు వారు తిరిగి వచ్చారు. వారికి సేవ చేసేందుకు ఇతర దేవుళ్ళను అనుసరించారు. ఇశ్రాయేలు యూదా వారి పూర్వికులతో నేను చేసిన నిబంధనను ఉల్లంఘించారు.
Settings