యెషయా 42:10-13
10
సముద్రయానం చేసేవారలారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపాల్లారా, వాటిలో నివసించేవారలారా! యెహోవాకు క్రొత్త గీతం పాడండి. భూమి అంచుల నుండి ఆయనను స్తుతించండి.
11
అరణ్యం, దాని పట్టణాలు, తమ స్వరాలు ఎత్తాలి; కేదారు నివాస గ్రామాలు సంతోషించాలి. సెల ప్రజలు ఆనందంతో పాడాలి; పర్వత శిఖరాల నుండి వారు కేకలు వేయాలి.
12
వారు యెహోవాకు మహిమ చెల్లించి ద్వీపాల్లో ఆయన స్తుతిని ప్రకటించాలి.
13
యెహోవా శూరునిలా బయలుదేరతారు యోధునిలా ఆయన తన రోషాన్ని రేకెత్తిస్తారు; ఆయన హుంకరిస్తూ యుద్ధ నినాదం చేస్తూ, తన శత్రువుల మీద గెలుస్తారు.
Settings