యెషయా 26:1-6
1
ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు: మనకు ఒక బలమైన పట్టణం ఉంది; దేవుడు రక్షణను దానికి గోడలుగా, ప్రాకారాలుగా ఉంచుతారు.
2
నీతిగల దేశం నమ్మదగిన దేశం ప్రవేశించేలా గుమ్మాలు తీయండి.
3
మీరు స్థిరమైన మనస్సుగల వారిని సంపూర్ణ సమాధానంతో కాపాడతారు, ఎందుకంటే వారు మీపై విశ్వాసముంచారు.
4
యెహోవా యెహోవాయే శాశ్వతమైన బండ కాబట్టి నిత్యం యెహోవాను నమ్ముకోండి.
5
ఆయన ఎత్తైన స్ధలంలో నివసించేవారిని అణచివేస్తారు ఎత్తైన కోటలను పడగొడతారు; ఆయన దానిని నేల మట్టుకు పడగొట్టి దానిని ధూళిలో కలుపుతారు.
6
అణచివేయబడినవారి కాళ్లతో పేదవారి అడుగులతో అది త్రొక్కబడుతుంది.
Settings