Skip to content
యెషయా 10:16-19

యెషయా 10:16-19

16
కాబట్టి, సైన్యాల అధిపతియైన యెహోవా, అష్షూరీయుల బలమైన వీరుల మీదికి పాడుచేసే రోగాన్ని పంపుతారు; వారి మహిమను కాల్చడానికి వారి క్రింద మండుతున్న జ్వాలల వంటి అగ్ని మండుతుంది.
17
ఇశ్రాయేలు వెలుగు అగ్నిగా మారుతుంది, వారి పరిశుద్ధ దేవుడు అగ్నిజ్వాలగా మారుతారు; అతని ముళ్ళచెట్లను, గచ్చపొదలను ఒక రోజులోనే వాటిని కాల్చి, దహించివేస్తుంది.
18
ఒక రోగి ఆరోగ్యం క్షీణించిపోవునట్లు అతని అడవికి, సారవంతమైన పొలాలకు ఉన్న వైభవాన్ని అది పూర్తిగా నాశనం చేస్తుంది.
19
అతని అడవిలో మిగిలిన చెట్లు కొన్నే మిగులుతాయి పిల్లవాడు కూడా వాటిని లెక్కపెట్టవచ్చు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options