ఆదికాండము 5:6-20
6
షేతు 105 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి ఎనోషు పుట్టాడు.
7
ఎనోషు పుట్టిన తర్వాత షేతు 807 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
8
షేతు మొత్తం 912 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
9
ఎనోషు 90 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి కేయినాను పుట్టాడు.
10
కేయినాను పుట్టిన తర్వాత ఎనోషు 815 సంవత్సరాలు బ్రతికాడు; అతనికి ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు.
11
ఎనోషు మొత్తం 905 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
12
కేయినాను 70 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి మహలలేలు పుట్టాడు.
13
మహలలేలు పుట్టిన తర్వాత కేయినాను 840 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
14
కేయినాను మొత్తం 910 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
15
మహలలేలు 65 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి యెరెదు పుట్టాడు.
16
యెరెదు పుట్టిన తర్వాత మహలలేలు 830 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
17
మహలలేలు మొత్తం 895 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
18
యెరెదు 162 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు అతనికి హనోకు పుట్టాడు.
19
హనోకు పుట్టిన తర్వాత యెరెదు 800 సంవత్సరాలు బ్రతికాడు; ఇతర కుమారులు, కుమార్తెలు అతనికి పుట్టారు.
20
యెరెదు మొత్తం 962 సంవత్సరాలు జీవించి, ఆ తర్వాత మరణించాడు.
Settings