Skip to content
ఆదికాండము 12:15-20

ఆదికాండము 12:15-20

15
ఫరో అధికారులు ఆమెను చూసి, ఆమె అందాన్ని ఫరో ఎదుట పొగిడారు, ఆమెను రాజభవనం లోనికి తీసుకెళ్లారు.
16
ఆమెను బట్టి అతడు అబ్రామును మంచిగా చూసుకున్నాడు, అబ్రాము గొర్రెలు, మందలు, ఆడ మగ గాడిదలు, ఆడ మగ దాసులు, ఒంటెలను ఇచ్చాడు.
17
కాని యెహోవా అబ్రాము భార్య శారాయిని బట్టి ఫరోను అతని ఇంటివారిని ఘోరమైన వ్యాధులతో శిక్షించారు.
18
కాబట్టి ఫరో అబ్రామును పిలిపించి, “నాకెందుకిలా చేశావు?” అని అన్నాడు. “ఈమె నీ భార్య అని నాకెందుకు చెప్పలేదు?
19
నేను ఆమెను నా భార్యగా చేసుకునేలా, ‘ఈమె నా చెల్లెలు’ అని నీవెందుకు నాతో చెప్పావు? ఇదిగో నీ భార్య, నీవు ఆమెను తీసుకుని వెళ్లిపో!” అని అన్నాడు.
20
అప్పుడు ఫరో తన మనుష్యులకు ఆజ్ఞ ఇచ్చాడు, వారు అతన్ని, అతని భార్యను, అతనితో ఉన్న ప్రతి దానితో పాటు పంపివేశారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options