Skip to content
యెహెజ్కేలు 45:18-25

యెహెజ్కేలు 45:18-25

18
“ ‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: మొదటి నెల మొదటి రోజున లోపం లేని కోడెను తీసుకుని పరిశుద్ధాలయాన్ని శుద్ధి చేయాలి.
19
యాజకుడు పాపపరిహారబలి రక్తంలో కొంత తీసి దానిని ఆలయ ద్వారబంధాల పైన, బలిపీఠపు పైగట్టు నాలుగు మూలల మీద, లోపలి ఆవరణ ద్వారబంధాల పైన చల్లాలి.
20
అనుకోకుండ గాని అవివేకంతో గాని ఎవరైనా పాపం చేస్తే, అలాంటి వారికి మీరు నెలలో ఏడవ రోజున అదే విధంగా చేయాలి; ఇలా మీరు ఆలయానికి ప్రాయశ్చిత్తం చేయాలి.
21
“ ‘మొదటి నెల పద్నాలుగవ రోజు పస్కా పండుగ ఆచరించాలి, ఆ పండుగ జరిగే ఏడు రోజులు మీరు పులియని రొట్టెలు తినాలి.
22
ఆ రోజు అధిపతి తన కోసం, దేశంలోని ప్రజలందరి కోసం పాపపరిహారబలిగా ఒక ఎద్దును అందించాలి.
23
పండుగ జరిగే ఏడు రోజుల్లో ప్రతిరోజు అతడు యెహోవాకు దహనబలిగా లోపం లేని ఏడు ఎద్దులు ఏడు పొట్టేళ్లను, పాపపరిహారబలిగా ఒక మేకపోతును ఇవ్వాలి.
24
అతడు భోజనార్పణగా ప్రతి కోడెతో పాటు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క కోడెకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఒక్క పొట్టేలుకు ఒక ఏఫా పిండిని, ప్రతీ ఏఫా పిండికి ఒక హిన్ ఒలీవ నూనెను కూడా ఇవ్వాలి.
25
“ ‘ఏడవ నెలలో పదిహేనవ రోజున ప్రారంభమయ్యే పండుగ యొక్క ఏడు రోజుల్లో కూడా అతడు పాపపరిహార బలులు, దహనబలులు, భోజనార్పణలు, నూనెను అదే విధంగా ఏర్పాటు చేయాలి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options