యెహెజ్కేలు 40:28-31
28
అప్పుడతడు దక్షిణ ద్వారం గుండా లోపలి ఆవరణంలోకి నన్ను తీసుకువచ్చి దక్షిణ ద్వారాన్ని కొలిచాడు; దీని కొలతలు ఇతర ద్వారాల కొలతలు ఒక్కటే.
29
దాని కాపలా గదులు ద్వారబంధాలు వాటి మధ్య గోడల కొలతలు మిగతా వాటి కొలతలు ఒక్కటే. దానికి చుట్టూ ఉన్న మధ్యగోడలకు కిటికీలు ఉన్నాయి. దాని పొడవు యాభై మూరలు, వెడల్పు ఇరవై అయిదు మూరలు ఉంది.
30
లోపలి ఆవరణం చుట్టూ ఉన్న మధ్య గోడల పొడవు ఇరవై అయిదు మూరలు వెడల్పు అయిదు మూరలు.
31
దాని మధ్య గోడలు బయటి ఆవరణానికి ఎదురుగా ఉన్నాయి; దాని ద్వారబంధాల మీద ఖర్జూరం చెట్లతో అలంకరించారు, పైకి ఎక్కడానికి ఎనిమిది మెట్లున్నాయి.
Settings