Skip to content
యెహెజ్కేలు 29:1-9

యెహెజ్కేలు 29:1-9

1
పదవ సంవత్సరం పదవనెల పన్నెండవ రోజు యెహోవా వాక్కు నాకు వచ్చి:
2
“మనుష్యకుమారుడా, నీ ముఖాన్ని ఈజిప్టు రాజైన ఫరోవైపు త్రిప్పి అతని గురించి ఈజిప్టు దేశమంతటి గురించి ప్రవచించి ఇలా చెప్పు:
3
‘ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నారు: “ ‘ఈజిప్టు రాజైన ఫరో, నైలు నదిలో పడుకుని ఉన్న ఘటసర్పమా, నేను నీకు విరోధిని. “నైలు నది నాదే, నేనే దాన్ని చేశానని నీవు అంటావు.”
4
కాని నేను నీ దవడలకు గాలాలు తగిలించి, నీ నదులలో ఉన్న చేపలు నీ పొలుసులకు అంటుకుపోయేలా చేస్తాను. నీ పొలుసులకు అంటుకున్న చేపలతో పాటు నైలు నదిలో నుండి నిన్ను బయటకు లాగుతాను.
5
నిన్ను నీ నదులలోని చేపలన్నిటిని నేను అరణ్యంలో విడిచిపెడతాను. నీవు నేల మీద పడతావు నిన్ను ఎత్తేవారు గాని, తీసేవారు గాని ఉండరు. అడవి మృగాలకు ఆకాశపక్షులకు నిన్ను ఆహారంగా ఇస్తాను.
6
అప్పుడు నేనే యెహోవానని ఈజిప్టు నివాసులందరూ తెలుసుకుంటారు. “ ‘ఈజిప్టు ఇశ్రాయేలీయులకు రెల్లుపుల్లల్లాంటి చేతికర్ర అయ్యింది.
7
వారు నిన్ను చేతితో పట్టుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి భుజాలలో గుచ్చుకున్నావు; వారు నీ మీద ఆనుకున్నప్పుడు నీవు విరిగిపోయి వారి నడుములు విరిగిపోవడానికి కారణమయ్యావు.
8
“ ‘ప్రభువైన యెహోవా చెబుతున్న మాట ఇదే: నేను నీ మీదికి కత్తిని రప్పిస్తాను. అది మనుష్యులను పశువులను చంపుతుంది.
9
ఈజిప్టు దేశం నిర్మానుష్యమై పాడైపోతుంది. అప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు. “ ‘నైలు నది నాది నేనే దానిని చేశానని నీవు అన్నావు కాబట్టి,
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options