Skip to content
యెహెజ్కేలు 14:8-11

యెహెజ్కేలు 14:8-11

8
వారికి నేను విరోధిగా ఉండి వారిని ఒక సూచనగా సామెతగా చేస్తాను. నేను వారిని నా ప్రజల నుండి తొలగిస్తాను. అప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకుంటారు.
9
“ ‘ఎవరైనా ప్రవక్త మోసపోయి ఏదైన ప్రవచనం చెబితే యెహోవానైన నేను ఆ ప్రవక్తను మోసం చేస్తాను. అతనికి వ్యతిరేకంగా నా చేయి చాపి నా ప్రజలైన ఇశ్రాయేలులో నుండి అతన్ని నాశనం చేస్తాను.
10
వారు తమ శిక్షను భరిస్తారు; ప్రవచనం కోసం వచ్చిన వాని దోషమెంతో ప్రవచించిన ప్రవక్త దోషం కూడా అంతే.
11
అప్పుడిక ఇశ్రాయేలు ప్రజలు నన్ను విడిచిపెట్టరు, వారు తమ పాపాలన్నిటితో తమను తాము అపవిత్రం చేసుకోరు. వారు నా ప్రజలై ఉంటారు. నేను వారి దేవుడినై ఉంటానని యెహోవా ప్రకటిస్తున్నారు.’ ”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options