Skip to content
యెహెజ్కేలు 12:6-16

యెహెజ్కేలు 12:6-16

6
వారు చూస్తుండగానే వాటిని నీ భుజంపై వేసుకుని సంధ్యా సమయంలో వాటిని తీసుకుని వెళ్లు. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు సూచనగా చేశాను కాబట్టి నీకు నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో.”
7
నాకు ఆజ్ఞాపించిన ప్రకారమే నేను చేశాను. దేశం విడిచి వెళ్తున్నట్లుగా పగలు నా సామాన్లు బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేతితో గోడను త్రవ్వాను. రాత్రి వారు చూస్తుండగా నా సామాన్లు భుజంపై ఎత్తుకున్నాను.
8
ఉదయాన యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
9
మనుష్యకుమారుడా, నీవేం చేస్తున్నావని తిరుగుబాటుదారులైన ఇశ్రాయేలీయులు నిన్ను అడగలేదా?
10
“వారితో ఇలా చెప్పు: ‘ప్రభువైన యెహోవా చెప్తున్న మాట ఇదే: ఈ ప్రవచనం యెరూషలేములోని యువరాజుకు అక్కడ ఉన్న ఇశ్రాయేలీయులందరికి సంబంధించినది.’
11
వారికి ఈ మాట చెప్పు: ‘నేను మీకు సూచనగా ఉన్నాను.’ “నేను చేసినట్లే వారికి కూడా జరుగుతుంది. వారు బందీలుగా దేశం నుండి కొనిపోబడతారు.
12
“వారిలో యువరాజు రాత్రివేళ తన సామాన్లు భుజంపై వేసుకుని తాను వెళ్లడానికి గోడను త్రవ్వుతాడు. అతడు నేల కనిపించకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.
13
అతన్ని పట్టుకోడానికి వల వేయగా అతడు దానిలో చిక్కుకుంటాడు. నేను అతన్ని బబులోనీయుల దేశమైన బబులోనుకు తీసుకువస్తాను కానీ అతడు దానిని చూడకుండానే అక్కడే అతడు చనిపోతాడు.
14
అతనితో ఉన్నవారందరిని అనగా అతని సహాయకులను అతని సైన్యాన్ని గాలికి చెదరగొడతాను. కత్తి దూసి వారినందరిని తరుముతాను.
15
“నేను వారిని జాతుల మధ్యకు చెదరగొట్టి వివిధ దేశాలకు వెళ్లగొట్టినప్పుడు నేనే యెహోవానని వారు తెలుసుకుంటారు.
16
వారు వెళ్లే దేశాల్లోని ప్రజలకు వారు చేసే అసహ్యమైన ఆచారాల గురించి వివరించడానికి వారిలో కొంతమందిని ఖడ్గం నుండి కరువు తెగులు నుండి కాపాడి తప్పిస్తాను. అప్పుడు వారు నేనే యెహోవానని తెలుసుకుంటారు.”
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options