Skip to content
యెహెజ్కేలు 12:1-8

యెహెజ్కేలు 12:1-8

1
యెహోవా వాక్కు నా వద్దకు వచ్చింది:
2
“మనుష్యకుమారుడా, నీవు తిరుగుబాటుదారుల మధ్య జీవిస్తున్నావు. వారు తిరుగుబాటు చేసే ప్రజలు కాబట్టి చూసే కళ్లు ఉన్నా చూడరు, వినే చెవులు ఉన్నా వినరు.
3
“కాబట్టి మనుష్యకుమారుడా, దేశాంతరం వెళ్లడానికి నీ వస్తువులను సర్దుకుని, పగటివేళ వారు చూస్తుండగానే బయలుదేరి నీవు ఉన్న చోటు నుండి వేరొక ప్రదేశానికి వెళ్లు. వారు తిరుగుబాటుదారులే అయినా బహుశా వారు అర్థం చేసుకోవచ్చు.
4
పగలు వారు చూస్తుండగా దేశం నుండి వెళ్లిపోడానికి సర్దుకున్న నీ సామాన్లు బయటకు తీసుకురా. సాయంత్రం వారు చూస్తుండగా దేశం విడిచి వెళ్తున్నట్లుగా బయలుదేరి వెళ్లు.
5
వారు చూస్తుండగా, గోడను త్రవ్వి దానిలో నుండి నీ వస్తువులను బయటకు తీయి.
6
వారు చూస్తుండగానే వాటిని నీ భుజంపై వేసుకుని సంధ్యా సమయంలో వాటిని తీసుకుని వెళ్లు. నేను నిన్ను ఇశ్రాయేలీయులకు సూచనగా చేశాను కాబట్టి నీకు నేల కనిపించకుండా నీ ముఖాన్ని కప్పుకో.”
7
నాకు ఆజ్ఞాపించిన ప్రకారమే నేను చేశాను. దేశం విడిచి వెళ్తున్నట్లుగా పగలు నా సామాన్లు బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేతితో గోడను త్రవ్వాను. రాత్రి వారు చూస్తుండగా నా సామాన్లు భుజంపై ఎత్తుకున్నాను.
8
ఉదయాన యెహోవా వాక్కు నా దగ్గరకు వచ్చింది:
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options