యెహెజ్కేలు 11:1-5
1
అప్పుడు ఆత్మ నన్ను పైకి లేపి తూర్పు వైపున ఉన్న యెహోవా మందిరపు ద్వారం దగ్గరకు తీసుకువచ్చాడు. ద్వారం దగ్గర ఇరవై అయిదుగురు మనుష్యులు ఉన్నారు, వారిలో ప్రజల నాయకులైన అజ్జూరు కుమారుడైన యాజన్యా, బెనాయా కుమారుడైన పెలట్యా నాకు కనిపించారు.
2
యెహోవా నాతో ఇలా అన్నారు, “మనుష్యకుమారుడా, వీరు చెడు కుట్రలు పన్నుతూ ఈ పట్టణంలో దుష్ట సలహాలు ఇస్తున్నారు.
3
వారు, ‘మన ఇల్లు కట్టుకోవడానికి ఇది సమయం కాదు; ఈ పట్టణం ఒక కుండ అయితే మనం దానిలో మాంసం’ అని అంటున్నారు.
4
కాబట్టి వారికి వ్యతిరేకంగా ప్రవచించు; మనుష్యకుమారుడా, ప్రవచించు.”
5
అప్పుడు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఇలా చెప్పమని నాతో చెప్పారు: “యెహోవా ఇలా చెప్తున్నారు: ఇశ్రాయేలు నాయకులారా, మీరు చెప్పేది అదే కాని మీ మనస్సులో వచ్చే ఆలోచనలు నాకు తెలుసు.
బైబిల్ పాఠం: Biblica® Open Telugu Contemporary Version™, © 1976, 1990, 2022, 2024 Biblica, Inc. · CC BY-SA 4.0“Biblica” is a trademark registered in the United States Patent and Trademark Office by Biblica, Inc., used with permission.
Settings