Skip to content
యెహెజ్కేలు 10:1-7

యెహెజ్కేలు 10:1-7

1
నేను చూడగా, కెరూబుల తలల పైన ఉన్న విశాలంపైన నీలమణి వంటి ప్రశస్తమైన రాళ్లతో చేసిన ఒక సింహాసనం వంటిది కనిపించింది.
2
నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబు క్రింద ఉన్న చక్రాల మధ్యకు వెళ్లు. కెరూబుల మధ్య ఉన్న నిప్పులు నీ చేతి నిండా గుప్పిలిలో తీసుకుని పట్టణమంతా చల్లు” అని చెప్పారు. నేను చూస్తుండగానే ఆయన లోపలికి వెళ్లిపోయారు.
3
ఆయన లోపలికి వెళ్లినప్పుడు కెరూబులు ఆలయానికి దక్షిణం వైపున నిలబడి ఉన్నాయి; ఒక మేఘం లోపలి ఆవరణాన్ని కమ్మివేసింది.
4
అప్పుడు యెహోవా మహిమ కెరూబు మీద నుండి పైకి వెళ్లి ఆలయ గుమ్మం వరకు వెళ్లింది. మేఘం మందిరాన్ని నింపివేసింది, ఆవరణం యెహోవా మహిమతో నిండిపోయింది.
5
కెరూబుల రెక్కల ధ్వని బయటి ఆవరణం వరకు, సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్నప్పుడు వినిపించే స్వరంలా వినబడింది.
6
నారబట్టలు వేసుకున్న వానితో యెహోవా, “కెరూబుల మధ్య ఉన్న చక్రాల మధ్య నుండి అగ్నిని తీసివేయి” అని ఆజ్ఞాపించినప్పుడు, అతడు లోపలికి వెళ్లి ఒక చక్రం ప్రక్కన నిలబడ్డాడు.
7
అప్పుడు కెరూబులలో ఒకడు తన చేతిని వారి మధ్య ఉన్న అగ్ని వైపుకు చాచి కొన్ని నిప్పులు తీసుకుని నారబట్టలు వేసుకున్న వాని చేతికి ఇవ్వగా అతడు వాటిని తీసుకుని బయటకు వెళ్లాడు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options