Skip to content
నిర్గమకాండము 35:25-29

నిర్గమకాండము 35:25-29

25
నైపుణ్యం కలిగిన ప్రతి స్త్రీ తమ చేతులతో వడికి తాము వడికిన నీలం ఊదా ఎరుపు రంగుల నూలు లేదా సన్నని నార తెచ్చారు.
26
నైపుణ్యం కలిగి ప్రేరేపించబడిన స్త్రీలందరు మేక వెంట్రుకలను వడికారు.
27
నాయకులు ఏఫోదులో, రొమ్ము పతకంలో పొదగడానికి లేతపచ్చ రాళ్లు, ఇతర రత్నాలు తెచ్చారు.
28
అలాగే దీపాలు వెలిగించడానికి ఒలీవనూనె, అభిషేక తైలానికి, పరిమళ వాసనగల ధూపానికి సుగంధద్రవ్యాలు తెచ్చారు.
29
మోషే ద్వారా యెహోవా వారికి చేయమని ఆజ్ఞాపించిన పనులన్నిటి కోసం ఇశ్రాయేలీయుల స్త్రీలు పురుషులలో ప్రేరేపించబడిన వారందరు ఇష్టపూర్వకంగా యెహోవాకు కానుకలు తెచ్చారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options