కంటెంట్‌కు వెళ్లండి
నిర్గమకాండము 30:34-38

పరిశుద్ధ ధూపపు మిశ్రమము

నిర్గమకాండము 30:34-38
34
యెహోవా మోషేతో ఇలా అన్నారు, “నీవు జటామాంసి, గోపిచందనం, గంధం అనే పరిమళద్రవ్యాలను, స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగాలలో తీసుకుని
35
పరిమళద్రవ్యాలను తయారుచేసేవాని పనియైన ధూపం యొక్క సువాసన మిశ్రమాన్ని తయారుచేయాలి. అది ఉప్పుగా, స్వచ్ఛముగా, పవిత్రంగా ఉండాలి.
36
దానిలో కొంచెం పొడిచేసి, సమావేశ గుడారంలో నిబంధన మందసం ముందు ఉంచండి, అక్కడ నేను మిమ్మల్ని కలుస్తాను. అది మీకు అతి పరిశుద్ధమైనదిగా ఉంటుంది.
37
అదే సూత్రంతో మీ కోసం మరొక ధూపద్రవ్యాలను తయారుచేసుకోవద్దు; అది యెహోవాకు పరిశుద్ధమైనదని పరిగణించండి.
38
దాని పరిమళాన్ని ఆస్వాదించడానికి దానిని పోలిన ధూపాన్ని తయారుచేసినవారు వారు తమ ప్రజల్లో నుండి కొట్టివేయబడాలి.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options