నిర్గమకాండము 28:2-5
2
నీ సోదరుడైన అహరోనుకు గౌరవం, ఘనత కలిగేలా అతని కోసం పవిత్ర వస్త్రాలను కుట్టాలి.
3
అహరోను నాకు యాజకునిగా సేవ చేయడానికి, అతడు ప్రతిష్ఠించబడాలి కాబట్టి అతనికి వస్త్రాలను తయారుచేయమని అలాంటి వాటి విషయాల్లో నేను జ్ఞానాన్ని ఇచ్చిన నైపుణ్యంగల పనివారందరికి చెప్పు.
4
వారు తయారుచేయవలసిన వస్త్రాలు ఇవే: రొమ్ము పతకం, ఏఫోదు, నిలువుటంగీ, అల్లిన చొక్కా, తలపాగా, నడికట్టు. నాకు యాజకులుగా సేవ చేయడానికి నీ సోదరుడైన అహరోనుకు అతని కుమారులకు ఈ పవిత్ర వస్త్రాలను తయారుచేయాలి.
5
వారికి బంగారంతో నీలం ఊదా ఎరుపు రంగుల నూలు పేనిన సన్నని నారబట్టను ఉపయోగించమని చెప్పండి.
Settings