నిర్గమకాండము 26:33-35
33
ఆ తెరను కొలుకుల క్రింద తగిలించి నిబంధన మందసాన్ని ఆ తెర వెనుక ఉంచాలి. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
34
అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.
35
తెర బయట సమావేశ గుడారానికి ఉత్తరం వైపు బల్ల ఉంచి దానికి ఎదురుగా దక్షిణం వైపు దీపస్తంభాన్ని ఉంచాలి.
Settings