నిర్గమకాండము 26:31-37
31
“నీలం ఊదా ఎరుపు రంగుల్లో పేనిన సన్నని నారతో ఒక తెరను చేయించి, నిపుణుడైన పనివానితో దానిమీద కెరూబులను అల్లించాలి.
32
తుమ్మ చెక్కతో నాలుగు స్తంభాలు చేసి బంగారంతో పొదిగించి నాలుగు వెండి దిమ్మలపై నిలబెట్టిన నాలుగు స్తంభాలకు బంగారు కొక్కేలతో దానిని వ్రేలాడదీయాలి.
33
ఆ తెరను కొలుకుల క్రింద తగిలించి నిబంధన మందసాన్ని ఆ తెర వెనుక ఉంచాలి. ఈ తెర పరిశుద్ధ స్థలాన్ని, అతి పరిశుద్ధ స్థలాన్ని వేరు చేస్తుంది.
34
అతి పరిశుద్ధ స్థలంలో నిబంధన మందసం మీద ప్రాయశ్చిత్త మూతను ఉంచాలి.
35
తెర బయట సమావేశ గుడారానికి ఉత్తరం వైపు బల్ల ఉంచి దానికి ఎదురుగా దక్షిణం వైపు దీపస్తంభాన్ని ఉంచాలి.
36
“గుడారపు ప్రవేశ ద్వారానికి నీలం, ఊదా ఎరుపు రంగులతో పేనిన సన్నని నారతో బుటా పనితో ఒక తెర తయారుచేయాలి.
37
ఈ తెర కోసం తుమ్మ చెక్కతో అయిదు స్తంభాలు చేసి వాటిని బంగారంతో పొదిగించాలి, అలాగే బంగారు కొక్కేలు చేయాలి. తర్వాత వాటికి అయిదు ఇత్తడి దిమ్మలు చేయాలి.
Settings