Skip to content
ప్రసంగి 2:4-8

ప్రసంగి 2:4-8

4
నేను గొప్ప పనులు మొదలుపెట్టాను: నా కోసం భవనాలు కట్టించుకున్నాను ద్రాక్షతోటలు నాటించాను.
5
తోటలు, ఉద్యానవనాలు వేయించి వాటిలో అన్ని రకాల పండ్లచెట్లు నాటించాను.
6
పెరుగుతున్న చెట్లకు నీరు అందించడానికి నేను చెరువులను త్రవ్వించాను.
7
దాసదాసీలను నేను వెల చెల్లించి కొన్నాను, నా ఇంట్లోనే పుట్టిపెరిగిన దాసులు కూడా నాకున్నారు. యెరూషలేములో నాకన్నా ముందు నుండి ఉన్న వారందరికంటే ఎక్కువ పశుసంపద గొర్రెల మందలు నాకున్నాయి.
8
నా కోసం వెండి బంగారం సమకూర్చుకున్నాను. విదేశాల నుండి రాజ సంపదను సేకరించాను. గాయనీ గాయకులను, మనుష్యుల హృదయాన్ని సంతోషపరిచే వాటిని సంపాదించాను; స్త్రీలు కూడా నా దగ్గర ఉన్నారు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options