Skip to content
ప్రసంగి 1:4-11

ప్రసంగి 1:4-11

4
తరాలు వస్తాయి తరాలు పోతాయి, కాని ఈ భూమి ఎప్పటికీ ఉంటుంది.
5
సూర్యుడు ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, తాను ఉదయించే చోటుకు మరలా చేరాలని త్వరపడుతున్నాడు.
6
గాలి దక్షిణం వైపు వీస్తూ అంతలోనే ఉత్తరానికి తిరుగుతుంది; అది సుడులు సుడులుగా తిరుగుతూ, తన దారిలోనే తిరిగి వస్తుంది.
7
నదులన్నీ సముద్రంలోనికే చేరుతాయి, అయినా సముద్రం ఎప్పటికీ నిండదు. నదులు ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయో అక్కడికే తిరిగి వెళ్తాయి.
8
అన్నీ శ్రమపడి అలసిపోతున్నాయి, మనుష్యులు దానిని వివరించలేరు. ఎంత చూసినా కంటికి తృప్తి కలుగదు. ఎంత విన్నా చెవికి సంతృప్తి కలుగదు.
9
ఇంతవరకు ఉన్నదే ఇకముందు కూడా ఉంటుంది, ఇంతవరకు జరిగిందే ఇకముందు జరుగబోతుంది; సూర్యుని క్రింద క్రొత్తది అంటూ ఏదీ లేదు.
10
“చూడండి! ఇది క్రొత్తది” అని ఎవరైనా ఒకదాని గురించి చెప్పడానికి ఏదైనా ఉందా? చాలా కాలం క్రితమే, అది ఉంది; మన కాలానికి ముందే అది ఉంది.
11
పూర్వతరాలు ఎవరికి జ్ఞాపకముండవు, రాబోయే తరాలు కూడా వాళ్ళ తర్వాతి తరం వాళ్ళకు అసలే జ్ఞాపకముండవు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options