Skip to content
ద్వితీయోపదేశకాండము 17:1-13

ద్వితీయోపదేశకాండము 17:1-13

1
మీ దేవుడైన యెహోవాకు మచ్చ గాని లోపంగాని ఉన్న ఎద్దునైనా గొర్రెనైనా బలిగా అర్పించకూడదు, అది మీ దేవుడైన యెహోవాకు అసహ్యము.
2
ఒకవేళ మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చే పట్టణాల్లో దేనిలోనైనా మీ మధ్య నివసిస్తున్న పురుషుడు గాని స్త్రీ గాని మీ దేవుడైన యెహోవా నిబంధన మీరి ఆయన దృష్టిలో చెడును చేస్తూ,
3
నా ఆజ్ఞకు వ్యతిరేకంగా ఇతర దేవుళ్ళను సేవించి, వాటికి గాని ఆకాశంలో ఉండే సూర్యచంద్ర నక్షత్రాలకు గాని నమస్కరిస్తూ ఉంటే,
4
ఆ విషయం మీ దృష్టికి తీసుకురాబడితే, మీరు దానిని క్షుణ్ణంగా పరిశోధించాలి. ఒకవేళ అది నిజమై, ఆ అసహ్యకరమైన విషయం ఇశ్రాయేలులో జరిగిందని నిరూపించబడితే,
5
ఆ దుర్మార్గం చేసిన పురుషుని గాని స్త్రీని గాని మీ పట్టణ ద్వారం దగ్గరకు తీసుకెళ్లి వారిని రాళ్లతో కొట్టి చంపాలి.
6
ఇద్దరు లేదా ముగ్గురు సాక్షుల వాంగ్మూలం మీదనే ఒక వ్యక్తికి మరణశిక్ష విధించాలి, కానీ ఒక్క సాక్షి వాంగ్మూలంపై ఎవరికి మరణశిక్ష విధించకూడదు.
7
ఆ వ్యక్తికి మరణశిక్ష విధించడంలో మొదట సాక్షుల చేతులు, తర్వాత ప్రజలందరి చేతులు ఉండాలి. మీరు మీ మధ్య నుండి దుర్మార్గాన్ని తొలగించాలి.
8
మీ దగ్గరకు వచ్చిన వివాదాలలో మీరు తీర్పు తీర్చడానికి చాలా కష్టంగా ఉన్న వివాదాలను అంటే రక్తపాతానికి సంబంధించినవి గాని వాదనలు గాని దాడులు గాని అలాంటి వాటిని మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలానికి తీసుకెళ్లండి.
9
లేవీయ యాజకుల దగ్గరకు, ఆ సమయంలో విధి నిర్వహణలో ఉన్న న్యాయమూర్తి దగ్గరకు వెళ్లండి. వాటి గురించి విచారించండి, వారు మీకు తీర్పు ఇస్తారు.
10
మీ దేవుడైన యెహోవా ఏర్పరచుకునే స్థలంలో వారు మీకు తెలియజేసిన నిర్ణయాల ప్రకారం మీరు నడుచుకోవాలి. మీరు చేయాలని వారు మీకు చెప్పే ప్రతిదీ జాగ్రత్తగా చేయాలి.
11
వారు మీకు బోధించిన, ఇచ్చిన నిర్ణయాల ప్రకారం మీరు చేయాలి. వారు మీకు చెప్పిన వాటినుండి కుడికి గాని ఎడమకు గాని తిరుగకూడదు.
12
న్యాయమూర్తి పట్ల గాని మీ దేవుడైన యెహోవాకు సేవచేసే యాజకుని పట్ల గాని ఎవరైనా ధిక్కారం ప్రదర్శిస్తే, వారికి మరణశిక్ష విధించబడాలి. మీరు ఈ దుర్మార్గాన్ని ఇశ్రాయేలు నుండి తొలగించాలి.
13
ప్రజలందరూ వింటారు, భయపడతారు, మళ్ళీ ధిక్కారంగా ఉండరు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options