Skip to content
ద్వితీయోపదేశకాండము 16:11-14

ద్వితీయోపదేశకాండము 16:11-14

11
మీరు, మీ కుమారులు, కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు యెహోవా తన నామానికి నివాస స్థలంగా ఏర్పరచుకొన్న స్థలంలో మీ దేవుడైన యెహోవా సన్నిధిలో ఆనందించాలి.
12
మీరు ఈజిప్టులో బానిసలుగా ఉన్న సంగతి జ్ఞాపకం చేసుకుని ఈ శాసనాలను జాగ్రత్తగా పాటించండి.
13
మీరు మీ నూర్పిడి కళ్ళం నుండి ధాన్యాన్ని, ద్రాక్ష గానుగ తొట్టె నుండి ద్రాక్షరసాన్ని సమకూర్చుకున్న తర్వాత గుడారాల పండుగ ఏడు రోజులు ఆచరించాలి.
14
మీరు, మీ కుమారులు కుమార్తెలు, మీ దాసదాసీలు, మీ పట్టణాల్లో నివసించే లేవీయులు, మీ మధ్య ఉండే విదేశీయులు, తండ్రిలేనివారు, విధవరాండ్రు, అందరు ఈ పండుగలో ఆనందించాలి.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 90 chars

Options