ద్వితీయోపదేశకాండము 12:11-14
11
అప్పుడు యెహోవా తన నామానికి నివాస స్థలాన్ని ఏర్పరచుకుంటారు. నేను మీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనగా, మీ దహనబలులు, మీ బలులు, మీ దశమభాగాలు, ప్రత్యేక అర్పణలు, మీరు యెహోవాకు ఇస్తామని మ్రొక్కుబడి చేసుకున్న కానుకలు అక్కడికే తీసుకురావాలి.
12
అక్కడ మీరు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ దాసులు దాసీలు, భాగం గాని స్వాస్థ్యం గాని లేకుండా మీ ఇళ్ళలో ఉండే లేవీయులు మీ దేవుడైన యెహోవా సన్నిధిలో సంతోషించాలి.
13
మీరు నచ్చిన ప్రతి స్థలంలో మీ దహనబలులు అర్పించకుండ జాగ్రత్తపడండి.
14
మీ గోత్రాల్లో ఒకదానిలో యెహోవా ఏర్పరచుకొనే స్థలంలోనే మీ దహనబలులు అర్పించి, అక్కడే నేను ఆజ్ఞాపించే వాటన్నిటిని జరిగించాలి.
Settings