2 రాజులు 24:13-16
13
యెహోవా ప్రకటించినట్లు, నెబుకద్నెజరు యెహోవా మందిరంలో నుండి, రాజభవనంలో నుండి విలువైన వస్తువులన్నిటిని బయటకు తెప్పించాడు, ఇశ్రాయేలు రాజైన సొలొమోను యెహోవా మందిరం కోసం చేయించిన బంగారు పాత్రలన్నిటిని బబులోను రాజు ముక్కలు చేశాడు.
14
అతడు యెరూషలేము నగరవాసులందరినీ అనగా దేశంలో ఉన్న బీదలను తప్ప అధికారులందరిని యుద్ధవీరులను హస్తకళాకారులను కంసాలివారిని మొత్తం పదివేలమంది బందీలుగా తీసుకెళ్లాడు.
15
నెబుకద్నెజరు యెహోయాకీనును బందీగా బబులోనుకు తీసుకెళ్లాడు. అతడు యెరూషలేము నుండి రాజు తల్లిని, రాజు భార్యలను, రాజభవన అధికారులను, దేశంలోని ప్రముఖులను కూడా తీసుకెళ్లాడు.
16
బబులోను రాజు ఏడు వేలమంది యుద్ధములలో ఆరితేరిన బలాఢ్యులైన పరాక్రమశాలులందరిని, వేయిమంది హస్తకళాకారులను, కంసాలివారిని కూడా తీసుకెళ్లాడు.
Settings