Skip to content
2 దినవృత్తాంతములు 19:4

2 దినవృత్తాంతములు 19:4

చుట్టుపక్కల సందర్భంతో వచనం 4 చూపబడుతోంది.
1
యూదా రాజైన యెహోషాపాతు క్షేమంగా యెరూషలేములో తన భవనానికి తిరిగి వస్తున్నప్పుడు,
2
హనానీ కుమారుడు, దీర్ఘదర్శియైన యెహు అతన్ని కలుసుకోడానికి వెళ్లి రాజైన యెహోషాపాతుతో, “మీరు దుర్మార్గులకు సహాయం చేస్తూ యెహోవాను ద్వేషించేవారిని ప్రేమిస్తారా? యెహోవాకు మీమీద కోపం వచ్చింది.
3
అయితే మీలో కొంత మంచి కూడా ఉంది, మీరు దేశం నుండి అషేరా స్తంభాలను తొలగించి, యెహోవాను వెదికి ఆయనను అనుసరించడానికి హృదయపూర్వకంగా నిశ్చయించుకున్నారు” అని అన్నాడు.
4
యెహోషాపాతు యెరూషలేములో ఉంటూ, బెయేర్షేబ నుండి ఎఫ్రాయిం కొండసీమవరకు ప్రజల మధ్యకు వెళ్లి వారిని మరల వారి పూర్వికుల దేవుడైన యెహోవా వైపుకు త్రిప్పాడు.
5
యూదా దేశంలో కోటగోడలు గల అన్ని పట్టణాల్లో అతడు న్యాయాధిపతులను నియమించాడు.
6
అతడు వారితో ఇలా అన్నాడు, “మీరు ఏమి చేస్తున్నారో జాగ్రత్తగా పరిశీలించండి, ఎందుకంటే మీరు కేవలం మనుష్యుల కోసం కాదు, మీరు ఎప్పుడు తీర్పు ఇచ్చినా మీకు తోడుగా ఉన్న యెహోవా కోసం తీర్పు ఇస్తున్నారు.
7
యెహోవా భయం మీమీద ఉండాలి. జాగ్రత్తగా తీర్పు తీర్చండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా అన్యాయం చేయరు, పక్షపాతం చూపించరు, లంచం తీసుకోరు.”
Settings

Reading Style

Typeface

Font Size 19px

Options