Skip to content
1 సమూయేలు 25:23-28

1 సమూయేలు 25:23-28

23
అబీగయీలు దావీదును చూసి, వెంటనే గాడిద దిగి దావీదు ఎదుట వంగి నేల మీద సాష్టాంగపడింది.
24
ఆమె అతని పాదాల మీద పడి, “నా ప్రభువా, తప్పంతా నాదేనని ఒప్పుకుంటున్నాను; మీ సేవకురాలినైన నన్ను మాట్లాడనివ్వండి, మీ సేవకురాలి మాట వినండి.
25
నా ప్రభువా, దుర్మార్గుడైన నాబాలును పట్టించుకోవద్దు. అతని పేరుకు అర్థం మూర్ఖుడు; నిజంగానే అతనిలో మూర్ఖత్వం ఉంది. ఇక నా విషయానికొస్తే, నా ప్రభువైన మీరు పంపిన మీ సేవకులను నేను చూడలేదు.
26
నా ప్రభువా, మీ దేవుడైన యెహోవా పేరిట, మీ జీవం తోడు, రక్తం చిందించకుండ మీ చేతులతో మీరే పగతీర్చుకోకుండా యెహోవా మిమ్మల్ని ఆపారు. మీ శత్రువులు నా ప్రభువైన మీకు కీడు చేయాలనుకునే వారికి నాబాలు గతే పడుతుంది.
27
మీ సేవకురాలినైన నేను నా ప్రభువైన మీకు తెచ్చిన ఈ కానుకను మీ వెంట ఉన్న మీ సేవకులకు ఇవ్వనివ్వండి.
28
“మీ సేవకురాలి పాపాన్ని క్షమించండి. నా ప్రభువైన మీరు యెహోవా యుద్ధాలను చేస్తున్నారు కాబట్టి నా ప్రభువు యొక్క రాజ్యాన్ని స్థిరపరుస్తారు. మీరు జీవించినంతకాలం మీకు కీడు కలుగదు.
Settings

Reading style

Typeface

Font size 19px

Reading width 90 chars

Options