1 రాజులు 8:29-30
29
నా పేరు అక్కడ ఉంటుందని మీరు ఈ మందిరాన్ని గురించి అన్నారు. కాబట్టి మీ దాసుడు ఈ స్థలం వైపు తిరిగి చేసే ప్రార్థన మీరు వినేలా రాత్రింబగళ్ళు మీ కనుదృష్టి ఈ మందిరంపై ఉంచండి.
30
మీ దాసుడు, మీ ఇశ్రాయేలు ప్రజలు ఈ స్థలం వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు వారి విన్నపం ఆలకించండి. మీ నివాసస్థలమైన పరలోకం నుండి వినండి, మీరు విన్నప్పుడు క్షమించండి.
Settings