Skip to content
1 రాజులు 1:11-18

1 రాజులు 1:11-18

11
అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబను ఇలా అడిగాడు, “హగ్గీతు కుమారుడైన అదోనియా రాజయ్యాడని, మన యజమాని దావీదుకు ఈ విషయం తెలియదని నీవు వినలేదా?
12
కాబట్టి ఇప్పుడు నీ ప్రాణాన్ని, నీ కుమారుడైన సొలొమోను ప్రాణాన్ని కాపాడుకోడానికి నేను నీకొక సలహా ఇస్తాను.
13
నీవు రాజైన దావీదు దగ్గరకు వెళ్లి, ‘నా ప్రభువా, రాజా, “నా తర్వాత నా కుమారుడైన సొలొమోను రాజు అవుతాడు, అతడు నా సింహాసనం మీద ఆసీనుడవుతాడు” అని మీరు నాకు ప్రమాణం చేయలేదా? ఇప్పుడు అదోనియా ఎందుకు రాజయ్యాడు?’ అని అడుగు.
14
నీవు ఇంకా రాజుతో మాట్లాడుతున్నప్పుడు నేను లోపలికి వచ్చి మీ మాటలను బలపరుస్తాను” అని సలహా ఇచ్చాడు.
15
కాబట్టి బత్షెబ తన గదిలో ఉన్న వృద్ధుడైన రాజు దగ్గరకు వెళ్లింది. అక్కడ షూనేమీయురాలైన అబీషగు రాజుకు సేవ చేస్తూ ఉంది.
16
బత్షెబ రాజు ఎదుట తలవంచి, సాగిలపడింది. “నీకేమి కావాలి?” అని రాజు అడిగాడు.
17
ఆమె అతనితో ఇలా అన్నది, “నా ప్రభువా, మీరు మీ దేవుడైన యెహోవా పేరిట మీ దాసురాలనైన నాతో ఇలా ప్రమాణం చేసి, ‘నా తర్వాత నీ కుమారుడైన సొలొమోను రాజుగా నా సింహాసనం మీద కూర్చుంటాడు’ అని అన్నారు.
18
కాని ఇప్పుడు అదోనియా రాజయ్యాడు, నా ప్రభువా, రాజువైన మీకు దీని గురించి తెలియదు.
Settings

Reading Style

Typeface

Font Size 19px

Reading Width 45 chars

Options